Sunday, October 3, 2010

Naaku Nachina Kavitha

నాకు నచ్చిన కవిత
written by someone else. I'm just sharing. if any one have objection plz tel me.



మెల్లిగా, గొప్ప గౌరవభావంతో...
భయ భక్తులతో... నీ తేనీటిని సేవించు.
నీ చేతిలోని టీ కప్పుని...
తదేకంగా, శ్రద్ధగా చూడు.
జీవితానికిదే ఇరుసులా కనిపిస్తుంది!
భూమి... నీ కప్పు చుట్టూ...
ఒక గమ్యంతో క్రమబద్ధంగా
కదులుతోంది చూడు!
అస్సలు త్వరపడడం లేదు...
నింపాదిగా పరిభ్రమిస్తోంది.
భవిష్యత్తు గురించి చింతే లేకుండా
తిరుగుతోంది.
నీ కప్పుని ప్రేమగా స్పృశించు.
సేవించడానికి ముందు ఆ వేడి పోగలను ఆస్వాదించు.
ఆ... క్షణంలో, అప్పటికదే జీవితం.
మరేదో ఆలోచిస్తూ
నీ తేనీటిని అవమానపరచకు.
ఏ క్షనానికాక్షణం జీవించడం నేర్చుకో.